టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం


విజయవాడ : తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మంగళవారమిక్కడ సమావేశమైంది. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది.  రేపటి నుంచి (బుధవారం) జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సభలో ప్రస్తావించడం, కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయడంపై ఈ భేటీలో దృష్టి సారిస్తారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి హాజరయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top