'బీజేపీకి ఆంధ్రా ప్రజల ఉసురు తగిలింది' | TDP MP fires on BJP | Sakshi
Sakshi News home page

'బీజేపీకి ఆంధ్రా ప్రజల ఉసురు తగిలింది'

Nov 10 2015 2:08 PM | Updated on Mar 29 2019 9:31 PM

'బీజేపీకి ఆంధ్రా ప్రజల ఉసురు తగిలింది' - Sakshi

'బీజేపీకి ఆంధ్రా ప్రజల ఉసురు తగిలింది'

టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

గుంటూరు: టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా ప్రజల ఉసురు తగిలి బిహార్లో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. 

బిహార్, కశ్మీర్లకు లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి ఏపీకి చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో యమునా నది నీళ్లు, పార్లమెంటు ఆవరణ నుంచి మట్టిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన విషయం తరెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అంతకుముందు ఇచ్చిన వరాలపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement