ఎమ్మెల్యే అత్తార్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకులు | tdp leaders reject chand bashr tour | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అత్తార్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకులు

Nov 9 2016 11:46 PM | Updated on Aug 10 2018 9:46 PM

మండల పరిధిలోని ఈతోడు పంచాయతీ చిన్న చెరువుపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన జన చైతన్యయాత్రలో ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాను పలువురు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.

తనకల్లు : మండల పరిధిలోని ఈతోడు పంచాయతీ చిన్న చెరువుపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన జన చైతన్యయాత్రలో ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాను పలువురు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. డబ్బుకు అమ్ముడుపోయి, పార్టీ మారిన ఎమ్మెల్యే జన చైతన్యయాత్రను నిర్వహించడానికి అనర్హుడన్నారు. కేవలం అధికారం కోసమే టీడీపీలోకి వచ్చావని గ్రామ నాయకులు వెంకటరామిరెడ్డి, వేణుగోపాల్‌ తదితరులు మండిపడ్డారు. వచ్చిన దారినే వెళ్లాలన్నారు.     

హామీల ప్రస్తావనే లేదు : ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రస్తావనే లేకుండా జన చైతన్యయాత్రను కొనసాగిస్తున్నారు. మండల కేంద్రమైన తనకల్లుతో పాటు, ఈతోడు, సీఆర్‌ పల్లి పంచాయతీల్లో ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా ఆధ్వర్యంలో జన చైతన్యయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చింది. ఈ హామీ పూర్తీ చేసిందంటే ప్రజల గ్రామాల్లోకి రానివ్వరనే విషయాన్ని ముందే పసిగట్టిన ఎమ్మెల్యే హామీలపై ఒక్కమాట కూడా మాట్లాడకుండా వడి వడిగా గ్రామాల్లో తిరిగారు. దీంతో ఇదో ఎన్నికల ప్రచార యాత్రగా మారిందని అధికార పార్టీ కార్యక్తలే బహిరంగంగా చర్చించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement