‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్‌కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు | Chodavaram MLA Faces Backlash Over Remarks at Kasturba School | Sakshi
Sakshi News home page

‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్‌కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

Jun 28 2025 5:59 PM | Updated on Jun 29 2025 10:17 AM

Chodavaram MLA Faces Backlash Over Remarks at Kasturba School

అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్‌ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్‌ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. 

‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు.  

ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి.  ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. 

‘‘పథకాల వల్లే..  ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement