breaking news
KSN Raju
-
చెలరేగిన ఆంధ్ర బౌలర్.. అద్భుత ప్రదర్శన
డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ కలిదిండి నరసింహ (కేఎస్ఎన్) రాజు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును నామమాత్రపు స్కోరకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు గురువారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎలో భాగమైన విజయనగరం వేదికగా ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది.యశ్ రాథోడ్ శతకంమ్యాచ్ ఆరంభం నుంచే ఆంధ్ర బౌలర్లు కట్టిపడేయడంతో విదర్భ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే, యశ్ రాథోడ్ (Yash Rathod- 104 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు. మరోవైపు.. ఈ సీజన్లో దంచి కొడుతున్న అమన్ మోఖడే (21), దానిశ్ మాలేవర్ (0), అథర్వ తైడె (13), సమర్థ్ (9)లను కేఎస్ఎన్ రాజు తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో విదర్భ ఒక దశలో 45/4తో కష్టాల్లో పడింది.ఈ సమయంలో యశ్ రాథోడ్ గొప్ప సంయమనం కనబర్చాడు. మొదట రోహిత్‌తో ఐదో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ అండతో జట్టును ముందుకు నడిపాడు. ఫలితంగా గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.మరో 28 పరుగులు జతచేసి ఈ క్రమంలో 267/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన విదర్భ మరో 28 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. ఆంధ్ర బౌలర్లలో రాజు ఐదు వికెట్లు (5/62) కూల్చగా.. కావూరి సాయితేజ యశ్ రాథోడ్ (115), రోహిత్ బింకర్ (37) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పార్థ్ రేఖడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లు ఆడి 295 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆంధ్ర జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
కస్తుర్బా విద్యాలయం ప్రిన్సిపల్ కు చోడవరం టీడీపీ MLA వేధింపులు
-
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్‌కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్‌ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు. ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ప్రజలను అవమానించేలా టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
-
మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు
అనకాపల్లి, సాక్షి: ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వాన్ని తిట్టిపోయడమే రోజూ పనిగా పెట్టుకున్నారు. పైగా అరాచకాలతో ఏపీని రావణ కాష్టంగా మార్చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఓ అధికార ఎమ్మెల్యే మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. -
చోడవరం టీడీపీ ఎమ్మెల్యే రాజుకు అసమ్మతి సెగ
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘన ?
విశాఖపట్నం, చోడవరం: ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు పలువురికి ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయమై కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పట్టాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించరాదు. అయితే ఆ నింబధనను చోడవరం టీడీపీ ఎమ్మెల్యే తుంగలోకి తొక్కి వెంకన్నపాలెం, లక్ష్మీపురం రోడ్డు ప్రాంతాల్లో ప్రభుత్వ బంజరు భూమికి సంబంధించిన పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 170 మంది లబ్ధిదారులకు అతని కార్యాలయంలో పట్టాలు పంపిణీచేసినట్టు తెలిసింది. ముందస్తు తేదీతో పట్టాలను సిద్ధం చేయగా, చోడవరం తహసీల్దార్ సోమవారం ఉదయమే సంతకాలు చేసినట్టు సమాచారం. వెంకన్నపాలెంలో సర్వే నంబరు 420, చోడవరం శివారు లక్ష్మీపురంరోడ్డులో సర్వే నంబరు 18లో సబ్‌డివిజన్ 30లో పలువురు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు పంపిణీ చేయడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పట్టాలు పంపిణీకి చోడవరంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ముందుగా అందర్నీ రప్పించినప్పటికీ తర్వాత ఎన్నికల కోడ్ ఉన్నందున బహిరంగంగా ఇస్తే ఇబ్బందులు వస్తాయని కొందరు అధికారులు సూచించడంతో బహిరంగం పంపిణీని మానేశారు. తరువాతగుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారులందర్నీ ఒక్కొరిగా పిలిచి పట్టాలు పంపిణీ చేశారని తెలిసింది. ఇదంతా తహసీల్దార్ పర్యవేక్షణలోనే జరిగినట్టు తెలిసింది. చోడవరం పంచాయతీ కార్యాలయాన్ని పట్టాల తయారీ కేంద్రంగా మారుచుకున్న ఎమ్మెల్యే ఇక్కడ నుంచే అన్నీ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేయగా దానికి రెవెన్యూ అధికారులు వెనకుండి నడిపించారని విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్‌కు ౖఫిర్యాదు చేస్తాం: ధర్మశ్రీ సోమవారం ఉదయం నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ చోడవరం తహసీల్దార్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి రెవెన్యూ భూమికి పట్టాలు పంపిణీచేశారని, దీనిపై కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నామని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన అధికారులు ఇలా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ఏంటని ఆయన మండిపడ్డారు. తహసీల్దార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ధర్మశ్రీ కోరారు. వెంకన్నపాలెంలో అయితే భూమిని లెవిలింగ్ చేయకుండా, ఇళ్లస్థలాలకు విభజించకుండా హడావిడిగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పట్టాలు ఇచ్చారని ఇందులో చాలామంది టీడీపీకి చెందిన అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ఎమ్మెల్యే రాజుకు ఎంతటి అవమానం!
విశాఖపట్నం: చోడవరం టీడీపి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు (కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు)కు ఆ పార్టీ సమావేశంలోనే అవమానం జరిగింది. వరుసగా రెండు సార్లు చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజుని పార్టీ కార్యకర్తల సమావేశంలోనికి పోలీసులు అనుమతించలేదు. మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. అందరూ చోద్యం చూసినట్లు ఉండిపోయారు. దాంతో ఎమ్మెల్యే రాజు తీవ్ర మనఃస్తాపానికి గురైయ్యారు. సమావేశం బయటే ఉండిపోయారు.


