
భర్తలే వచ్చి తీసుకెళ్తారు
టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వ్యాఖ్యలు
ద్వారకాతిరుమల: ఇదివరకటి లాగా ఇంట్లో భర్త విసుక్కున్నా.. కసురుకున్నా ఎవరూ పడాల్సిన పని లేదని, హ్యాపీగా ఫ్రీ బస్ ఎక్కేసి పుట్టింటికి వెళ్లి పోతే, భర్తే వచ్చి తీసుకువెళతారని గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన స్పౌజ్ పెన్షన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలను రెచ్చగొట్టేలా ఉన్నాయని కొందరు మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
