
ప్రముఖుల డుమ్మా!
మడకశిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో శనివారం జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశా న్ని నిర్వహించారు.
మడకశిర: మడకశిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో శనివారం జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశా న్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొ లిసారిగా నియోజకవర్గ కేంద్రంలో సమావేశాన్ని ఏర్పా టు చేశారు. సమావేశాన్ని నిర్వహించడంలో ఎమ్మెల్యే, ఎ మ్మెల్సీ విజయవంతమైనా జిల్లా నేతలందరినీ ఒకే వే దికపై తీసుకురావాలన్న ప్రయత్నం మాత్రం ఫలించలే దు. దీంతో జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలున్నాయనడానికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎమ్మెల్సీ గుండుమల జేసీ సోదరులకు చాలా సన్నిహితుడు. తప్పకుండా జేసీ సోదరులు హాజరవుతారని భావించారు. అయితే ఈసమావేశానికి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హాజరు కాలేదు. అలాగే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా, గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ హాజరు కాలేదు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తారని ప్రచారం జరిగింది. ఆయన రాకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు.
‘కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది’
మడకశిర: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో శనివారం జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా టీyీ పీ అధ్యక్షుడు బీకే పార్థసారథి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర టీడీపీ ప్రజా ప్రతినిధులు పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా మంత్రులు పరిటాల, పల్లె మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సమావేశంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, ధర్మవరం, కళ్యాణదుర్గం, మడకశిర ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జెడ్పీ చైర్మన్ చమన్, మాజీ ఎంపీ సైఫుల్లా, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, అనంతపురం మేయర్ స్వరూప, స్థానిక మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, టీడీపీ జెడ్పీటీసీలు పాల్గొన్నారు.