
తెలుగు తమ్ముళ్ల హైరానా
ప్రభుత్వ భూమిలో పాగా వేసిన తెలుగు తమ్ముళ్లు.. తీరా ఆ విషయం వెలుగులోకి రావడంతో..
► కలకలం సృష్టిస్తున్న ‘భూంఫట్’ కథనం
► రక్షించాలంటూ ముఖ్యనేత కుమారుడిని
► వేడుకుంటున్న ఆక్రమణదారులు
► అజ్ఞాతంలోకి వీఆర్వోలు.. తప్పుదోవ
► పట్టించేందుకు యత్నాలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ భూమిలో పాగా వేసిన తెలుగు తమ్ముళ్లు.. తీరా ఆ విషయం వెలుగులోకి రావడంతో.. రక్షించాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ పెద్దాయన కుమారుడిని ఆశ్రయించినట్లు సమాచారం. బుధవారం ‘భూంఫట్.. పత్తికొండలో రియల్ దందా’ పేరిట ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికంగా(పత్తికొండలో) టీడీపీ వర్గీయుల్లో ప్రకంపనలు సృష్టించడంతో చేసేదేమీ లేక ముఖ్యనేత కుమారుడిని శరణువేడుకొన్నట్లు తెలుస్తోంది. ఉదయమే ఆయన పీఏతో టీడీపీ కార్యాలయంలో సమావేశమై భూ ఆక్రమణ విషయమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
భూ ఆక్రమణలకు పాల్పడింది టీడీపీ నేతలే కావడంతో వారిని రక్షించేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే ఏకంగా రికార్డులను తారుమారు చేసేందుకైనా సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఒకవైపు ఈ తప్పు తమమీద పడకుండా చూస్తూనే.. మరోవైపు సదరు టీడీపీ నేతను సైతం రక్షించేలా పావులు కదుపుతున్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం 16 సెంట్ల ప్రభుత్వ భూమి మాత్రమే ఆక్రమణకు గురైందని ఓ రెవెన్యూ అధికారి బాహాటంగా చేస్తున్న ప్రచారంపై వాదనకు బలాన్ని చేకూరుస్తోందనే చెప్పాలి.
అజ్ఞాతంలోకి వీఆర్‌వోలు
సాక్షి’లో వచ్చిన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు కూడా దృష్టి సారి ంచారు. ఆఘమేఘాలపై స్థానిక తహసీల్దార్‌ను పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించడంతో బుధవారం ఉదయమే ఆ కార్యాలయంలో హడావుడి కనిపించింది. ఆర్‌డీఓ కూడా రానున్నట్లు సమాచారం ఉండటంతో.. ఈ వ్యవహారంలో సహకరించిన తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది భయాందోళనతోనే విధులు నిర్వర్తించారు. పత్తికొండ ప్రాంతంలో 15 ఏళ్లుగా పాతుకుపోయిన ఇద్దరు వీఆర్‌వోలు బుధవారం ఉద యం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ‘సాక్షి’ కథనంపై స మగ్ర విచారణ జరపాలంటూ ఆదేశాలు రావడంతో వీరిద్దరూ అందుబాటులో లే కుండా పోయారు. విచారణలో తమ స్వామి భక్తి ఎక్కడ బయటపడుతోందన్న ఆందోళనతోనే వారు విధులకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.