 
															పచ్చనేత ఇంటికి చేరిన జన్మభూమి సభ
రాజంపేట మున్సిపాలిటిలో జన్మభూమిసభల నిర్వహణ వివాదస్పదంగా మారుతోంది.గురువారం సుద్దగుంతలలో స్ధానిక టీడీపీ నేత ఇంటివద్ద జన్మభూమి సభను నిర్వహించారు.
	రాజంపేట: రాజంపేట మున్సిపాలిటిలో జన్మభూమిసభల నిర్వహణ వివాదస్పదంగా మారుతోంది.గురువారం  సుద్దగుంతలలో స్ధానిక టీడీపీ నేత  ఇంటివద్ద జన్మభూమి సభను నిర్వహించారు. మున్సిపాలిటీకి చెందిన రెండవటీం నిర్వాహకులు  మున్సిపాలిటీ టీపీఓ బాలాజి, టీపీఎస్ మధుసూదనరావురు నేతృత్వంలో కార్యక్రమం కొనసాగింది.   మున్సిపాలిటి విడుదల చేసిన ప్రకటనలో 5వతేదీన ఎంపీపీ ఎలిమెంటరీ స్కూలులో సభను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత ఇంటి వద్ద సభను నిర్వహించే విధంగా మున్సిపాలిటి అధికారులపై ఒత్తిడి తెచ్చారు.  చేసేదేమిలేక ఆయన ఇంటి వద్ద జన్మభూమిసభను నిర్వహించారు.  సభకు హాజరైన మహిళలు  ఇదేమి విడ్డూరం అంటూ అసంతృప్తితో  వెళ్లిపోయారు. దీనికి అధికారులు ఏ విధంగా అంగీకరించారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  ఈ సభకు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కమిషనరు రమణారెడ్డి, రాజంపేట ఏరియా ఆసుపత్రి కమిటి చైర్మన్ వడ్డెరమణ, జెబీ సభ్యులు గుల్జార్‌బాష, మల్లెల సుబ్బరాయుడు, డా.సుధాకర్, సంజీవరావు, అబుబకర్, చిదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
