పోలీసుల కూంబింగ్ : ఎర్రచందనం కూలీలు అరెస్ట్ | task force police combing in chittoor district | Sakshi
Sakshi News home page

పోలీసుల కూంబింగ్ : ఎర్రచందనం కూలీలు అరెస్ట్

Jun 21 2016 9:30 AM | Updated on May 10 2018 12:34 PM

తిరుపతి సమీపంలోని కరకంబాడీ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు.

తిరుపతి : తిరుపతి సమీపంలోని కరకంబాడీ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 30 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.

అలాగే శ్రీనివాసమంగాపురం సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఎర్రచందనం కూలీని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి బియ్యం, పప్పు దినుసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారంతా తమిళనాడు వాసులను పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement