
వచ్చే రెండున్నరేళ్లలో 5,880 మెగావాట్లే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండున్నరేళ్లలో 5,880 మెగావాట్ల విద్యుత్ లక్ష్యంగా పని చేస్తుందని టీఎస్ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు అన్నారు.
పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండున్నరేళ్లలో 5,880 మెగావాట్ల విద్యుత్ లక్ష్యంగా పని చేస్తుందని టీఎస్ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వం చలోని 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీ లించారు. ప్రణాళికాబద్ధంగా పనులు వేగవంతం చేసి, డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఓఅండ్‌ఎం కర్మాగా రంలో సీసీఎం (కాంట్రాక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్)లో సమీక్ష నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లా డుతూ 1,080 మెగావాట్ల మణుగూరు భద్రాద్రి ప్లాంట్‌పై పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఈఏసీ సిఫార్సు చేసిం దన్నారు. 4వేల మెగావాట్ల దామరచర్ల ప్లాంట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణపై గైడ్‌లైన్స్ తయారు చేస్తున్నామన్నారు. పాల్వం చలో 38 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. రాష్ట్రంలో రోజుకు విద్యుత్ డిమాండ్ 8,495 మెగావాట్లు వస్తుందని, దీనిని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో జెన్‌కో డైరెక్టర్లు సి.రాధాకృష్ణ (ప్రాజెక్ట్సు), సచ్చిదానందం (థర్మల్), సీఈలు అజయ్, జె.సమ్మయ్య, పి.రత్నాకర్, సిద్ధయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.