ఫుట్‌బాల్‌ క్రీడకు ఆదరణ తేవాలి | take foot ball game as a career | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ క్రీడకు ఆదరణ తేవాలి

Aug 12 2016 11:03 PM | Updated on Oct 2 2018 8:39 PM

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఏఆర్‌ డీఎస్పీ సంజీవ్‌ - Sakshi

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఏఆర్‌ డీఎస్పీ సంజీవ్‌

ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీడకు ఆదరణ పెరిగేలా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఏఆర్‌ డీఎస్పీ పి.సంజీవ్‌ కోరారు.

  • ఏఆర్‌ డీఎస్పీ సంజీవ్‌ 
  • జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభం 
  • ఖమ్మం స్పోర్ట్స్‌ : ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ క్రీడకు ఎంతో ఆదరణ ఉందని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీడకు ఆదరణ పెరిగేలా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఏఆర్‌ డీఎస్పీ పి.సంజీవ్‌ కోరారు. జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (డీటీసీ)లో జిల్లాస్థాయి లీగ్‌ ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ఏఆర్‌ డీఎస్పీ పి.సంజీవ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లాలో ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉందని, ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఖమ్మం వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి క్రీడను అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్‌ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఫుట్‌బాల్‌ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్‌ ఆర్‌ఐ విజయ్‌బాబు, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.ఆదర్శకుమార్, సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారులు ఎండీ అక్తర్, శ్రీను, రాంబాబు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 
    తొలి ఫలితాలు : 
    జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లాస్థాయి లీగ్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో వీవీపాలెం– సత్తుపల్లి జట్టుపై 2–0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ఇల్లెందు– డీటీసీ ఫుట్‌బాల్‌ జట్టుపై 2–0 గోల్స్‌ తేడాతో, పాల్వంచ–ఖమ్మం పోలీస్‌గ్రౌండ్‌పై 1–0  గోల్స్‌ తేడాతో నెగ్గాయి. 
     
    క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఏఆర్‌ డీఎస్పీ సంజీవ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement