ముగిసిన టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు | TABLE TENNIS GAMES COMPLETE | Sakshi
Sakshi News home page

ముగిసిన టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

Nov 6 2016 10:46 PM | Updated on Sep 4 2017 7:23 PM

ముగిసిన టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

ముగిసిన టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

వట్లూరు (పెదపాడు) : స్థానిక సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన అంతరజిల్లాల టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి.

వట్లూరు (పెదపాడు) : స్థానిక సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన అంతరజిల్లాల టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ఆదివారంతో ముగిశాయి. టెన్నిస్‌ అసోసియేషన్, సీఆర్‌ఆర్‌ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో విజేతగా విశాఖపట్నం, రన్నర్‌గా కృష్ణా జిల్లా జట్లు నిలిచాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా జట్లు సెమీస్‌ జట్లుగా నిలిచాయి. మహిళల విభాగంలో విన్నర్‌గా విశాఖపట్నం, రన్నర్‌గా కృష్ణా విజయం సాధించాయి. జూనియర్‌ బాలుర విభాగంలో విన్నర్‌గా కృష్ణా, రన్నర్‌గా విశాఖపట్నం సెమీ ఫైనల్‌ జట్లుగా పశ్చిమ, తూర్పు గోదావరి జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు.  
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement