అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 24న భూ నిర్వాసితుల సంఘీభావ రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు భూనిర్వాసిత సంఘీభావ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ పిన్నింటి కనకరెడ్డి తెలిపారు. స్థానిక రామకృష్ణాపురంలోని సాహిత్య మండలిలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ
24న భూ నిర్వాసితుల సంఘీభావ సదస్సు
Sep 12 2016 12:41 AM | Updated on Nov 9 2018 5:56 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 24న భూ నిర్వాసితుల సంఘీభావ రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు భూనిర్వాసిత సంఘీభావ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ పిన్నింటి కనకరెడ్డి తెలిపారు. స్థానిక రామకృష్ణాపురంలోని సాహిత్య మండలిలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో ముఖ్యంగా విస్తరణ పేరుతో ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూమిని లాక్కోవడం, గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా వారిని నిర్వాసితులను చేస్తూ, గిరిజన చట్టాలను తుంగలో తొక్కి వేలాది ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించడం, తీరప్రాంత మత్స్యకారుల జీవన శైలిని దెబ్బతీస్తున్న ప్రభుత్వ విధానాలపై చర్చ జరుగుతుతుందన్నారు. విజయవాడలో జరిగే సదస్సుకు తమ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వై.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిస్తారని, ఈ సదస్సులో పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, ప్రజా కళామండలి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం 24న జరిగే సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వై.వెంకటేశ్వర్లు, దేపాటి శివప్రసాద్, మెరుపు జ్ఞానరాజు, కొయ్యా అశ్విరెడ్డి, తాడి నగేష్, ఎం.రామకృష్ణ, ఎస్‌కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement