నున్నలో వ్యక్తి ఆత్మహత్య | suvisude case filed | Sakshi
Sakshi News home page

నున్నలో వ్యక్తి ఆత్మహత్య

Jul 20 2016 9:22 PM | Updated on Sep 4 2017 5:29 AM

నున్న (విజయవాడ రూరల్‌) : నున్న గ్రామంలో ఓ వ్యక్తి బుధవారం తాను ఉంటున్న గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన మాంజీ ఉపేంద్ర (35) నున్న గ్రామంలోని చెప్పుల కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్నాడు.

నున్న (విజయవాడ రూరల్‌) :
 నున్న గ్రామంలో ఓ వ్యక్తి బుధవారం తాను ఉంటున్న గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన మాంజీ ఉపేంద్ర (35) నున్న గ్రామంలోని చెప్పుల కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈయనకు భార్య మధుమాలతి, రెండేళ్ల కుమార్తె, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. ఉపేంద్ర గ్రామానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డి ఇంటిలో మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంటిలోనే మరో పోర్షన్‌లో కోల్‌కతాకు చెందిన రంజిత్‌రాణా కూడా ఉంటున్నారు.  ఉపేంద్ర రోజూ మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండేవాడు. మంగళవారం ఉదయం చెప్పల కంపెనీకి పనికని వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాలేదు. రాత్రికి కంపెనీలో ఓటీ చేస్తున్నాడేమోనని భావించిన భార్య పిల్లలతో కలిసి భోజనం చేసి పడుకుంది. ఉదయం సుమారు 6.30 గంటలకు లేచి చూడగా ఉపేంద్ర చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆమె పక్కనే ఉంటున్న రంజిత్‌రాణాకు విషయం చెప్పగా ఆయన ఇంటి యజమానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఉరి వేసుకున్న గదిలోపల గడియ పెట్టి ఉండడంతో గ్రామ పెద్దలతో కలిసి పోలీసులు తలుపులు పగులగొట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నున్న రూరల్‌ పోలీసు స్టేషన్‌ సీఐ సహేరాబేగం ఆధ్వర్యంలో ట్రెయినింగ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement