బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం | BJP Training Classes | Sakshi
Sakshi News home page

బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం

Oct 21 2016 10:27 PM | Updated on Sep 4 2017 5:54 PM

బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం

బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం

నున్న సమీపంలో ఉన్న వికాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

నున్న (గన్నవరం) :    నున్న సమీపంలో ఉన్న వికాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆంధ్ర చీఫ్‌ భరత్‌జీ దేశ సంస్కృతి, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సిద్ధాంతాల గురించి వివరించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతం, నాయకత్వ నిర్మాణం, సుశిక్షుతులైన నాయకులను తయారు చేయడంపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఆర్‌ రవీంద్రరాజు వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు యుగంధర్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.




 

Advertisement
 
Advertisement
Advertisement