యువకుడి ఆత్మహత్య | suviside case filed | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Jul 27 2016 8:49 PM | Updated on Sep 4 2017 6:35 AM

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోని షెడ్డులో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని పంట పొలాల్లో పనులకు వచ్చిన కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

దావులూరు (కంకిపాడు) :
 ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోని షెడ్డులో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని పంట పొలాల్లో పనులకు వచ్చిన కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. మంగళవారం రాత్రి ఆ యువకుడు అక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారించుకున్నారు. తాను వేసుకున్న చొక్కాకు, బ్యానర్‌తో ముడి వేసి షెడ్డులోని ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతుడు బందరు మండలం గరాలదిబ్బకు చెందిన పంతగాని నాగూర్‌ (32) గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద లక్ష్మీ తిరుపతమ్మ, దావులూరు, గౌడ అన్న కార్డు ముక్క దొరికింది. బందరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement