అత్తగారి పెత్తనం తట్టుకోలేక.. | Suicide attempt with Aunt Suffering: Son in law | Sakshi
Sakshi News home page

అత్తగారి పెత్తనం తట్టుకోలేక..

Jul 12 2016 4:12 AM | Updated on Sep 2 2018 4:37 PM

అత్తగారి పెత్తనం తట్టుకోలేక.. - Sakshi

అత్తగారి పెత్తనం తట్టుకోలేక..

అత్తలు పెట్టే బాధలను భరించలేక గరుగుబిల్లి మండలం బాలగుడబ గ్రామంలో ఓ అల్లుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం..
పార్వతీపురం: అత్తలు పెట్టే బాధలను భరించలేక గరుగుబిల్లి మండలం బాలగుడబ గ్రామంలో ఓ అల్లుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..  పట్టణంలోని బెలగాంలో అత్త బాధ భరించలేక ఓ కోడలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీటికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు, బాధితుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని ఇల్లపిల్లికి చెందిన ఈల మురళి గురుగుబిల్లి మండలం బాలగుడబకు చెందిన అరుణను వివాహం చేసుకుని గ్రామంలోనే నివాసముంటున్నాడు.

వీరికి సంజన అనే పాప ఉంది. అత్త వల్ల భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండడంతో మనస్తాపం చెందిన మురళి సోమవారం పురుగమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఏరియూ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  
 
బెలగాంలో..

బెలగాంనకు చెందిన మీసాల రూపకు తగరపువలసకుచెందిన సంతోష్‌తో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల పాప ఉంది. అయితే సంతోష్ సింగరేణిలో పనిచేస్తుండడంతో రూప తన పాపతోపాటు అత్తవద్దే ఉంటోంది. నిత్యం అత్త వేధిస్తుండడంతో మనశ్శాంతి లేక రూప ఇటీవల తన తల్లివద్దకు వచ్చింది. అప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో ఇంట్లో ఉన్న ఫినారుుల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఏరియూ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement