Jul 24 2016 12:13 AM | Updated on Sep 19 2019 2:50 PM
విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు అనకాపల్లి గవరపాలెంలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
అనకాపల్లిటౌన్: విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు అనకాపల్లి గవరపాలెంలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఏఎస్‌ఐ ఫణి క«థనం మేరకు విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన కొమ్మోరు శ్రీనివాసరావు(25)అనే యువకుడికి వివాహమైంది. అయితే అక్కడే నివాసం ఉంటూ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మూడు నెలలు క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో తన భర్త కనిపించడంలేదని అతని భార్య సరోజని అప్పట్లో విశాఖ ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేసింది. శ్రీనివాసరావు ఆ మహిళతో ఎక్కడెక్కడో తిరిగి అనకాపల్లి చేరుకున్నాడు. గవరపాలెం కర్రిపైడియ్యగారివీధిలో ఒక ఇంటిని మూడురోజుల క్రితం అద్దెకు తీసుకొని ఆమెతో ఉంటున్నాడు. రెండురోజులపాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు. శనివారం ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఆ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఏఎస్‌ఐ చెప్పారు. సమాచారం అందడంతో భార్య సరోజని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ చెప్పారు.