రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపిక | Students selected to rifle shooting competitions | Sakshi
Sakshi News home page

రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపిక

Nov 24 2016 8:26 PM | Updated on Sep 4 2017 9:01 PM

రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపిక

రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు ఎంపిక

హైదరాబాద్‌లో ఈనెల 25, 26 తేదీల్లో జరుగుతున్న జాతీయస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు భాష్యం విద్యార్థులు..

గుంటూరు ఎడ్యుకేషన్‌: హైదరాబాద్‌లో ఈనెల 25, 26 తేదీల్లో జరుగుతున్న జాతీయస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలకు భాష్యం విద్యార్థులు బయలుదేరి వెళ్లారని  భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్‌ మూడవ లైనులోని భాష్యం మెయిన్‌ క్యాంపస్‌లో గురువారం విద్యార్థులను అభినందించిన అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ఈనెల 14,15,16 తేదీల్లో ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో అండర్‌–19 విభాగంలో సీనియర్‌ ఇంటర్‌ బైపీసీ విద్యార్థిని వై. శ్రీనిత్య, సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థిని ఎం.రిషిత, జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థి వి.హర్ష వర్ధన్‌రెడ్డి అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికయ్యారని వివరించారు. శుక్ర, శని వారాల్లో హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంగా విద్యార్థులకు పుష్ఫగుచ్ఛాలను అందజేసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement