రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక | Students are selected for state level competetions | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Aug 31 2016 11:56 PM | Updated on Sep 4 2017 11:44 AM

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు.

కొండమల్లేపల్లి
పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నర్రా గోపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అండర్‌–14 విభాగంలో ఈనెల 27న నల్లగొండలో జరిగిన ఫుట్‌బాల్‌ క్రీడల్లో అయిదుగురు పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనెల 7,8,9 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పీడీ భావన, ఉపాధ్యాయులు పెద్దన్న, బక్కయ్య, లోక్యానాయక్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement