ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల కుదింపును నిరసిస్తూ గురువారం అనంతపురం కలెక్టరేట్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి.
అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల కుదింపు చర్యలను నిరసిస్తూ గురువారం విద్యార్థి సంఘాలు అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో కుదించడంపై విద్యార్థి సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కుదింపును వెనక్కితీసుకోవాలని, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని గురువారం అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరుద్యోగ ఐక్యవేదిక దీక్ష చేపట్టింది. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన ఐక్య వేదిక డిమాండ్ చేసింది.