రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | student dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Jul 20 2017 11:00 PM | Updated on Nov 9 2018 4:36 PM

మండల కేంద్రంలోని నార్పల క్రాస్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోయాడు.

బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని నార్పల క్రాస్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... శింగనమల మండలం కొరివిపల్లి గ్రామానికి చెంది ఈశ్వరయ్య బీకేఎస్‌లోని ఐకేపీలో సీసీగా పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు జితేంద్ర (11) నగరంలోని శారదానగర్‌ కాలనీలో శ్రీసాయి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. జితేంద్రకు అక్కడ పాఠశాలలో చదవడం ఇష్టం లేకపోవడంతో పాఠశాల నుంచి కొరివిపల్లి ఇంటికి నడుచుకుంటూ బయలు దేరాడు. అయితే బీకేఎస్‌ మండల కేంద్రంలోని నార్పల క్రాస్‌ వద్ద తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తున్న ఓ కారు జితేంద్రను ఢీ కొంది. కారు డ్రైవరే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement