తండ్రి మర ణించాడని తెలిసినా ఆ బాధను దిగమింగి చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్థి సోమవారం పదోతరగతి పరీక్ష రాశాడు.
నగరి : తండ్రి మర ణించాడని తెలిసినా ఆ బాధను దిగమింగి చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్థి సోమవారం పదోతరగతి పరీక్ష రాశాడు. నగరి మండలం అడవికొత్తూరు దళితవాడకు చెందిన రఘువరన్ (46) దినసరి కూలీ. ఆయనకు నలుగురు కుమారులు. మూడో కుమారుడు వెంకటేశ్ సత్రవాడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం రఘువరన్ ఆనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణవార్త విన్న వెంకటేశ్ ఆ బాధను దిగమింగి సోమవారం చివరి పరీక్ష రాశాడు.