చిన్నారిపై వీధికుక్క దాడి | Stray dog attacks child | Sakshi
Sakshi News home page

చిన్నారిపై వీధికుక్క దాడి

Sep 12 2016 12:41 AM | Updated on Oct 20 2018 6:19 PM

చిన్నారిపై వీధికుక్క దాడి - Sakshi

చిన్నారిపై వీధికుక్క దాడి

సంగం : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్కదాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన సంగం రాళ్లచెలికలో ఆదివారం జరిగింది.

సంగం : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్కదాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన సంగం రాళ్లచెలికలో ఆదివారం జరిగింది. రాళ్లచెలికకు చెందిన వెంకటరమణమ్మ, రమణయ్య దంపతుల నాలుగేళ్ల బాలుడు చందు ఆదివారం ఉదయం ఇంటికి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా పిచ్చికుక్క చిన్నారిపై దాడి చేసింది. చందు పెద్దగా కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసే సరికి కుడి కంటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో  వైద్యశాలకు తరలించారు. అక్కడ చిన్నారికి వైద్యులు కుడికన్ను పైభాగంలో 12 కుట్లు వేయాల్సి వచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement