పెసర కొనుగోలు కేంద్రం ప్రారంభం | start buying Moong center | Sakshi
Sakshi News home page

పెసర కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sep 28 2016 11:26 PM | Updated on Sep 4 2017 3:24 PM

పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో బుధవారం ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రాం రెడ్డి పెసర, మినుముల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ

 
పిట్లం :
పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో బుధవారం ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రాం రెడ్డి పెసర, మినుముల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నిజాంసాగర్, పిట్లం మండలాల్లో గల పెసర, మినుము రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో పెసర కొనుగోలు కేంద్రం ప్రారంభించామని తెలిపారు. క్వింటాలుకు 5,225 మద్దతు ధర ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రజనీకాంత్‌  రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ నర్సాగౌడ్, సెక్రెటరీ రాంనాథ్‌రావు, డైరెక్టర్‌ సాయిరెడ్డి, సంపత్, సత్యనారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, లక్ష్మణ్, రెహమత్, నందు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement