ముందంజలో ఎస్‌ఎస్‌బీఎన్‌ | ssbn first in inter colleges sports | Sakshi
Sakshi News home page

ముందంజలో ఎస్‌ఎస్‌బీఎన్‌

Oct 1 2016 11:35 PM | Updated on Nov 6 2018 5:13 PM

ముందంజలో ఎస్‌ఎస్‌బీఎన్‌ - Sakshi

ముందంజలో ఎస్‌ఎస్‌బీఎన్‌

పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల మహిళా క్రీడా పోటీల్లో అనంతపురానికి చెందిన ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ముందంజలో ఉంది.

హిందూపురం టౌన్‌ : పట్టణంలోని ఎన్‌ఎస్‌పీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల మహిళా క్రీడా పోటీల్లో అనంతపురానికి చెందిన ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ముందంజలో ఉంది. శనివారం అంతర్‌ కళాశాలల ఆటల పోటీలకు ఎస్కేయు స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ జెస్సీ, ఎన్‌ఎస్‌పీఆర్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ అంజలీదేవి, కొడిగెనహళ్ళి ప్రిన్సిపల్‌ వాసుదేవరెడ్డి, ఆనంద్‌నాయక్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌ శంకరయ్య, కార్యదర్శి, పీడీ ముస్తఫా కమల్‌భాషా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పోటీల ఫలితాలు
– కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల(అనంతపురం) విజేతగా, ఎస్వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) రన్నర్స్‌గా నిలిచారు.
– బాస్‌కెట్‌ బాల్‌ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్‌ కళాశాల(అనంతపురం) విజేతగా, కెఎస్‌ఎన్‌ కళాశాల (అనంతపురం)  రన్నర్స్‌గా నిలిచారు.
– వాలీబాల్‌ పోటీల్లో ఎస్‌ఎస్‌బీన్‌ కళాశాల(అనంతపురం) విజేతగా, శ్రీ వాణి వ్యాయామ కళాశాల(హిందూపురం) రన్నర్స్‌గా నిలిచారు.
– బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల (అనంతపురం) విజేతగా, కెఎస్‌ఎన్‌ కళాశాల (అనంతపురం) రన్నర్స్‌గా నిలిచారు.
– ఖో ఖో పోటీల్లో ఎస్‌కేపీ కళాశాల(గుంతకల్లు) విజేతగా, కెఎస్‌ఎన్‌ కళాశాల (అనంతపురం) రన్నర్స్‌గా నిలిచారు.
– యోగా పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల(హిందూపురం) విజేతగా, సప్తగిరి కళాశాల (హిందూపురం) రన్నర్స్‌గా నిలిచారు.
– చెస్‌ పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం), ఎస్‌వీ డిగ్రీ కళాశాల(అనంతపురం) రెండూ విజేతలుగా నిలిచాయి.
– టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఎన్‌ఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల (హిందూపురం) ఫైనల్‌కు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement