తుంగతుర్తి : ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి కాలువల ద్వారా చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని వైస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
ఎస్సారెస్పీ జలాలతో చెరువులను నింపాలి
Jul 29 2016 12:58 AM | Updated on Sep 4 2017 6:46 AM
తుంగతుర్తి : ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి కాలువల ద్వారా చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని వైస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో సరిగా వర్షాలు లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా జలాలను మళ్లించి ఈ ప్రాంతంలోని చెరువులను నింపాలని కోరారు. ఆయనతో పాటు ఎస్సారెస్పీ నాయకులు తుమ్మరాస్వామి, సంద రవి, గులాం సందాని, ఇరుగు సైదులు, రమేష్, సతీష్, వీరభద్రం, వెంకన్న, వినయ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement