సైన్స్‌ కాంగ్రెస్‌కు శ్రీ నలంద విద్యార్థిని ఎంపిక | sri nalanda student selected in state science congress | Sakshi
Sakshi News home page

సైన్స్‌ కాంగ్రెస్‌కు శ్రీ నలంద విద్యార్థిని ఎంపిక

Dec 1 2016 6:46 PM | Updated on Sep 15 2018 7:30 PM

సిద్దవటం లోని శ్రీ నలండ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లక్ష్మిప్రసన్న అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి 24వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కు ఎంపికైయారని ఆ పాఠశాల కరస్పాండెంట్‌ బాలుగారి వెంకటసుబ్బయ్య తెలిపారు.

సిద్దవటం: సిద్దవటం లోని శ్రీ నలండ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లక్ష్మిప్రసన్న అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి 24వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కు ఎంపికైయారని ఆ పాఠశాల కరస్పాండెంట్‌ బాలుగారి వెంకటసుబ్బయ్య తెలిపారు.   గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి కడప లోని సైన్స్‌ మ్యూజియంలో జరిగిన 24వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలో తమ పాఠశాలకు విద్యార్థిని  లక్ష్మిప్రసన్న  ఆహారం మరియు వ్యవసాయం అనే అంశంపై సెమినార్‌లో పాల్గొని చక్కటి ప్రతిభను కనపరచడంతో న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు.  డిశంబర్‌ 3,4, తేదీలలో విజయవాడలో జరిగే రాష్ఠ్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆ విద్యార్థికి గైడ్‌ ఉపాధ్యాయుడుగా నరసింహబాబు వ్యవహరిస్తున్నారన్నారు.  దీంతో గురువారం లక్ష్మిప్రసన్న ను ప్రధానోపాధ్యాయుడు లోకేష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement