
శ్రీమంగళగౌరిదేవీ అవతారంలో పెద్దమ్మతల్లి
మండల పరిధిలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రీదేవీశరన్నవరాత్రోత్సవాల సందర్భంగా పెద్దమ్మతల్లి మంగళవారం శ్రీమంగళగౌరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పాల్వంచ రూరల్ : మండల పరిధిలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రీదేవీశరన్నవరాత్రోత్సవాల సందర్భంగా పెద్దమ్మతల్లి మంగళవారం శ్రీమంగళగౌరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ సత్యనారాయణ పర్యవేక్షణలో అర్చకులు అమ్మవారిని పూలమాలలతో అలంకరించి సూక్తాభిషేకం, శ్రీచక్రార్చన, రుద్రహోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఆంజనేయస్వామివారికి పంచామృతాభిషేక పూజలు నిర్వహించారు.