శ్రీనివాస్‌కు రత్నశాస్త్ర శిరోమణి అవార్డు | sreenivas rathna shiromani award | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌కు రత్నశాస్త్ర శిరోమణి అవార్డు

Jul 25 2016 12:07 AM | Updated on Sep 4 2017 6:04 AM

శ్రీనివాస్‌కు రత్నశాస్త్ర శిరోమణి అవార్డు

శ్రీనివాస్‌కు రత్నశాస్త్ర శిరోమణి అవార్డు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన చింతకింది శ్రీనివాస్‌కు రత్నశాస్త్రం (జెమాలజి)లో రత్న శాస్త్ర శిరోమణి అవార్డు వచ్చింది.

యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన చింతకింది శ్రీనివాస్‌కు రత్నశాస్త్రం (జెమాలజి)లో రత్న శాస్త్ర శిరోమణి అవార్డు వచ్చింది. ఆదివారం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జరిగిన అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం 18వ వార్షిక మహాసభలో ఈ అవార్డును అందజేశారు. గత 20ఏళ్ల క్రితం ౖహె దరాబాద్‌కు వెళ్లి రత్నశాస్త్రంలో వివిధ రకాల నైపుణ్యత గల కోర్సులను అభ్యసించాడని, నవరత్న వ్యాపారం, టెస్టింగ్‌ ల్యాబ్‌ నడుపుతున్నారని శ్రీనివాస్‌ తండ్రి సత్యనారాయణ తెలిపారు. అవార్డు గ్రహీత శ్రీనివాస్‌ తమిళనాడు నుంచి సాక్షితో ఫోన్లో మాట్లాడుతూ, ప్రతి మనిషి నవరత్నాలు నైపుణ్యం గలవని తెలుసుకోవాలని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement