మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాదాబైనామాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్‌పీటర్ అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు.
వేగంగా సాదాబైనామాలు
Aug 25 2016 12:09 AM | Updated on Oct 8 2018 5:07 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాదాబైనామాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్‌పీటర్ అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో వీర్వోలకు ఇచ్చే ట్యాబ్‌లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఎల్‌ఈసీ కార్డుల జారీ, ప్రభుత్వ భూముల వెరిఫికేషన్‌ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ఈ వీసీకి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం. రాంకిషన్, డీఆర్‌ఓ భాస్కర్, డి–సెక్షన్ తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు హాజరయ్యారు.
Advertisement
Advertisement