యాదాద్రిలో విశేష పూజలు | special puja in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో విశేష పూజలు

Sep 2 2016 11:29 PM | Updated on Sep 4 2017 12:01 PM

యాదాద్రిలో విశేష పూజలు

యాదాద్రిలో విశేష పూజలు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ఊంజల్‌సేవలను ఘనంగా నిర్వహించారు.

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి  ఊంజల్‌సేవలను ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆలయంలోని స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. శుక్రవారం పురస్కరించుకుని ఆలయాన్ని ఉదయం 3గంటలకే తెరిచారు. దేవస్థానం ఏర్పాటు చేసిన 108 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం ఊంజల్‌ సేవలను నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్, వేముల వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement