మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు | Massive blast at Malkapuram Green Industries Yadadri Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రీస్‌లో భారీ పేలుడు

Oct 16 2026 6:55 PM | Updated on Oct 16 2026 7:05 PM

Massive blast at Malkapuram Green Industries Yadadri Bhuvanagiri District

(File Photo)

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రీస్ పార్క్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆక్సీ-నౌ పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

పరిశ్రమలో సిలిండర్లలో ఆక్సిజన్‌ నింపుతున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బిహార్‌ ప్రాంతానికి చెందిన మనీష్‌ కుమార్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ప్రమాదానానికి సంబంధించి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ల పేలుడుతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కలకలం రేగింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో  పరిసర ప్రాంతాల్లోని కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. 

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ కవచ్‌’.. భారీగా వాహనాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement