ఏడున్నర కిలోల కణితి తొలగింపు | special operation in preethi nursing home | Sakshi
Sakshi News home page

ఏడున్నర కిలోల కణితి తొలగింపు

Oct 16 2016 11:49 PM | Updated on Sep 4 2017 5:25 PM

ఓ మహిళ అండాశయంలోని ఏడున్నర కిలోల కణితి (ఒవేరియన్‌ సిస్ట్‌)ని గుంతకల్లు పట్టణంలోని ప్రీతి నర్సింగ్‌ హోమ్‌కు చెందిన వైద్యులు తొలగించారు.

గుంతకల్లు టౌన్‌ : ఓ మహిళ అండాశయంలోని ఏడున్నర కిలోల కణితి (ఒవేరియన్‌ సిస్ట్‌)ని  గుంతకల్లు పట్టణంలోని ప్రీతి నర్సింగ్‌ హోమ్‌కు చెందిన వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం నర్సింగ్‌ హోం సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ బి.సరోజమ్మ విలేకరులకు వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని మోదినాబాద్‌కు చెందిన నాగమ్మ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండేది.

బళ్లారిలో వైద్యుల్ని సంప్రదించగా అండాశయంలో కణితి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమె శనివారం ప్రీతి నర్సింగ్‌హోమ్‌లో చేరింది. డాక్టర్‌ బి.సరోజమ్మ ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్‌ ఆపరేషన్‌ ద్వారా కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయమూ లేదని డాక్టర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement