breaking news
special operation
-
‘భయంతో చచ్చిపోతున్నాం’.. భారతీయుల తరలింపునకు కేంద్రం ఆపరేషన్!
సాక్షి, ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడుల కారణంగా భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో ఉన్న వివిధ దేశాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్లో విదేశీయుల తరలింపునకు ఆ దేశ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టనుంది. ఇరాన్లో సుమారు పదివేల మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ పేరుతో ఖరారు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా విదేశీయులకు తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో తమ పరిస్థితి దినదినగండంగా ఉందని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ మాట్లాడుతూ..‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్మెంట్కు పరుగులు తీశాం. అప్పటినుంచి మాకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి. Indian Embassy in Iran issues an advisory for all Indian nationals and persons of Indian origin currently residing in #Iran.The advisory issued in view of the current situation in Iran.All Indian nationals and Persons of Indian Origin have been asked to follow the Embassy's… pic.twitter.com/aggk1YGaRj— All India Radio News (@airnewsalerts) June 15, 2025ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది. టెహ్రాన్‌లోని షాహిద్ యూనివర్సిటీలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ, మేం చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కోరాడు.మరోవైపు.. ఇరాన్లో తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ సందర్భంగా..‘ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్‌లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
HYD: భారీగా సైబర్ నేరగాళ్ల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.ఆరు ప్రత్యేక బృందాలతో హైటెక్ నేరగాళ్ల కోసం చేసి గాలింపు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా 18 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు ఆరెస్టు చేశారు.వీరిపై తెలంగాణలో 45కుపైగా సైబర్ క్రైమ్ కేసులు ఉండగా దేశవ్యాప్తంగా 319 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు,26సెల్ఫోన్లు,16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.సెక్స్టార్షన్,పెట్టుబడులు, కొరియర్ పేరుతో వీరు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. తెలంగాణలో ఈ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.6.94 కోట్లు సైబర్ నేరాల ద్వారా కాజేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పోలీసులే షాక్ అయ్యేలా.. విశాఖ హానీ ట్రాప్ కేసులో -
సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు
-
ఎర్ర స్మగ్లర్లకు ఎదురు దెబ్బ
మైదుకూరు ప్రాంతంలో అటవీ అధికారుల స్పెషల్ ఆపరేషన్ ♦ 184 మంది తమిళకూలీలను అదుపులోకి తీసుకున్న వైనం ♦ దళారులను అదుపులోకి తీసుకుని వారి ద్వారా కూలీలను బయటకు రప్పించిన అధికారులు ♦ జిల్లా చరిత్రలో ఇంత భారీగా తమిళ కూలీలు పట్టుబడటం ఇదే ప్రథమం ఖాజీపేట: ఎర్రచందనం స్మగ్లర్లకు జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 184 మంది తమిళకూలీలను అటవీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారినుంచి 352 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా లంకమల అటవీప్రాంతం కేంద్రంగా చేసుకుని స్మగ్లర్లు చెలరేగి పోతున్నారు. ఇక్కడి ఎర్రచందనాన్ని యథేచ్ఛగా ఎల్లలు దాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి తమ అదుపులో ఉన్న నలుగురు స్మగ్లర్లను ఇంటరాగేషన్ చేసి వారి ద్వారానే అడవిలో ఉన్న కూలీలను బయటికి రప్పించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అటవీ అధికారుల అదుపులో ఉన్న తమిళ కూలీలను పూర్తి స్థాయిలో విచారిస్తే బడా స్మగ్లర్ల బండారం బయటపడే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా అటవీ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రూటు మార్చిన తమిళ కూలీలు.. స్మగ్లర్లు ఒకప్పుడు తిరుపతి, రైల్వేకోడూరు పరిసరాల్లోని శేషాచలం కొండల్లో తమిళ కూలీల రాకపోకలు అధికంగా ఉండేవి. అక్కడ దాడులు తీవ్రమయ్యే సరికి తమ రూటు మార్చుకున్నారు. అక్కడి అడవుల్లోకి వెళ్లడం తగ్గించి లంకమల అడవుల్లోకి రావడం మొదలు పెట్టారు. గతంలో ఇక్కడ కేవలం స్థానికంగా ఉన్న వారు మాత్రమే అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారు. ముఖ్యంగా ఖాజీపేట మండలంలో నాగసానిపల్లె, దుంపలగట్టు, పత్తూరు, కూనవారిపల్లె, నాగపట్నం, సీతానగరం, కొత్తపేట, చెన్నముక్కపల్లె గ్రామాల్లో అలాగే మైదుకూరు మండలంలో వనిపెంట, మైదుకూరుకు చెందిన కొందరు, జాండ్లవరం, బసాపురం, ఉప్పకుంటపల్లె సుగాలీతాండా, దువ్వూరు మండలంలో నీలాపురం, దాసరిపల్లె, కృష్ణంపల్లె, బి.మఠం మండలంలోని కొండ ప్రాంతంలోని గ్రామాల్లోని వారు అధికంగా ఉన్నారు. కానీ 2015 నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడి వారు బడా స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని తమిళ కూలీలను ఇక్కడికి రప్పిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఖాజీపేట పరిసర ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేసేసరికి వారంతా ఇప్పుడు పంథా మార్చారు. రాత్రిపూట పోలీసుల గస్తీ ముమ్మరం కావడంతో పగలే అడవుల్లోకి తమిళ కూలీలను వివిధ వాహనాల్లో తరలిస్తున్నారు. ఇలా అడవుల్లోకి వెళ్లి తిష్టవేసిన వారిని పక్కావ్యూహంతో బయటకు రప్పించే పనిలో అటవీ అధికారులు ప్రస్తుతం సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. స్థానికుల సహకారం.. తమిళ కూలీలకు కావాలి్సన వంట సరుకును స్థానిక స్మగ్లర్లే సమకూరుస్తున్నారు. తాజాగా దొరికిన తమిళ కూలీలకు ఇక్కడి వారు సుమారు రూ.90 వేలు విలువ చేసే సరుకులు పంపినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన బిల్లులు అటవీ అధికారులకు దొరికినట్లు సమాచారం. స్పృహ తప్పిన కూలీలు అడవి నుంచి తమిళ కూలీలను అటవీ అధికారులు ఓ లారీలో ఎక్కించి పైన పూర్తిగా పట్టను కట్టేసి తీసుకురావడంతో ఉక్కపోతను తట్టుకోలేక పలువురు కూలీలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే వారికి చికిత్స అందించారు. అలాగే తమిళ కూలీలకు బిస్కెట్లు, మంచినీటిని అధికారులు అందజేశారు. ఎన్నికల మాటున తరలించేందుకు ప్లాన్ జిల్లాలో 9వ తేదీ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో పోలీసులంతా ఎన్నికల బందోబస్తులో నిమగ్నమై ఉంటారు.. తమ పని సులభంగా కానియొ్యచ్చని స్మగ్లర్లు భావించారు. అందుకు తగ్గట్టుగా వారం రోజులు ముందుగానే కూలీలను వివిధ మార్గాల ద్వారా ఖాజీపేట, మైదుకూరు మండలాల పరిధిలోని అడవుల్లోకి పంపించారు. అయితే కొందరు దళారులు అటవీ అధికారులకు దొరకడంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. చీమలపుట్ట నుంచి చీమలు బయటకు వచ్చినట్లు అడవి నుంచి కూలీలను బయటకు రప్పించి స్మగ్లర్లకు షాక్ ఇచ్చారు. తెరవెనుక బడా స్మగ్లర్లు ఎక్కడ ? తెరవెనుకే ఉండి అక్రమ రవాణా పూర్తిగా సాగిస్తున్న స్మగ్లర్లు బయటకు రావడంలేదు. వారు బయటే ఉండి తమిళకూలీలు, స్థానిక దళారుల ద్వారా తతంగం అంతా నడిపిస్తున్నారు. తమిళ కూలీలు ఇక్కడకు వచ్చేందుకు వారి పేరున బడా స్మగ్లర్లు రూ.10లక్షలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు సమాచారం.అలాగే వారికి రాకపోకలకు అయిన ఖర్చులు, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అయ్యే కోర్టు ఖర్చులు కూడా బడా స్మగ్లర్లే భరిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లు, కూలీలను అన్ని కోణాల్లో విచారిస్తే మరిన్ని ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. వందల సంఖ్యలో పట్టుబడుతున్న తమిళ కూలీలు ఖాజీపేట మండల పరిధిలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడులను పరిశీలిస్తే ఒక్క ఫారెస్ట్ అధికారులే సుమారు 400 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అదే పోలీసులు ఈ ఏడాది జనవరి నుంచి జరిపిన దాడులు పరిశీలిస్తే సుమారు 100 మందికి పైగా తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులకు పట్టుబడిన తమిళ కూలీలు కేసు నుంచి బయటకు రాగానే తిరిగి ఇక్కడికి వస్తున్నారు. అటవీ అధికారులకు సవాల్.. గత కొంతకాలంగా పోలీసులు చేపట్టిన కూంబింగ్‌లో తమిళకూలీలు పట్టుబడుతుండటంతో అటవీ అధికారులపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి భారీ సంఖ్యలో తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని తమ తడాఖా చూపించారు. అటవీ అధికారులు తమ వ్యూహాలకు మరింత పదును పెడితే మరిన్ని సత్ఫలితాలు సాధించగలరనడంలో సందేహం లేదు. -
తల్లీబిడ్డకు పునర్జన్మ!
అనంతపురం మెడికల్ : అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి తల్లీబిడ్డకు పునర్జన్మనిచ్చారు ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు. శనివారం సూపరింటెండెంట్ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్, గైనకాలజిస్ట్ పి.షబానా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనగానపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన చిట్టెక్క, రామాంజప్ప దంపతుల కుమార్తె లక్ష్మికి పావగడ తాలూకాలోని కొండకిందపల్లికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. గర్భిణి కావడంతో లక్ష్మి కొన్ని నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. ఈనెల 12న ప్రసవ నొప్పులు రావడంతో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. కిడ్నీ పాడవడంతోపాటు కామెర్లు కూడా ఉన్నాయి. రక్తంలో సోడియం లెవెల్స్ 125 మిల్లీమోల్స్ ఉండాల్సి ఉండగా 107 మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే మెదడులో నీరు చేరే ప్రమాదం ఎక్కువ. ఈ క్రమంలో 13వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు ఒకసారి, 4 గంటలకు మరోసారి లక్ష్మికి ఫిట్స్ వచ్చాయి. అప్పటి నుంచి వైద్య చికిత్సలు అందిస్తూ వచ్చారు. అదేరోజు సాయంత్రం ఆమె కోమాలోకి వెళ్లిపోవడంతో సిజేరియన్‌కు సిద్ధం చేశారు. సాధారణంగా సిజేరియన్ సమయంలో పూర్తి మత్తు ఇస్తారు. కానీ ఈమె విషయంలో గర్భాశయం ఇరువైపుల మాత్రమే మత్తు (ట్రాన్స్ అబ్డామినల్) ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ఇలా చేయడం అత్యంత క్లిష్టకరమైనది. ఆ తర్వాత 45 నిమిషాల్లో ఆపరేషన్ ముగించారు. మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. రాయలసీమలోనే ప్రప్రథమం ‘ట్రాన్స్ అబ్డామినల్’ చేయడం రాయలసీమలోనే ప్రప్రథమమని వైద్య బృందం తెలిపింది. లక్ష్మి గర్భం దాల్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, క్లిష్ట పరిస్థితుల్లో విజయవంతంగా ఆపరేషన్ చేశారని సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావు వైద్యులను అభినందించారు. తన కుమార్తె పరిస్థితి చూసి ఇక బతకదనుకున్నానని, ఇక్కడి డాక్టర్లు ప్రాణం పోశారని లక్ష్మి తల్లి చిట్టెక్క వైద్యులకు చేతులు జోడించింది. -
ఏడున్నర కిలోల కణితి తొలగింపు
గుంతకల్లు టౌన్ : ఓ మహిళ అండాశయంలోని ఏడున్నర కిలోల కణితి (ఒవేరియన్ సిస్ట్)ని గుంతకల్లు పట్టణంలోని ప్రీతి నర్సింగ్ హోమ్‌కు చెందిన వైద్యులు తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం నర్సింగ్ హోం సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బి.సరోజమ్మ విలేకరులకు వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని మోదినాబాద్‌కు చెందిన నాగమ్మ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండేది. బళ్లారిలో వైద్యుల్ని సంప్రదించగా అండాశయంలో కణితి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆమె శనివారం ప్రీతి నర్సింగ్‌హోమ్‌లో చేరింది. డాక్టర్ బి.సరోజమ్మ ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయమూ లేదని డాక్టర్ తెలిపారు.