తాగుబోతులకు షాక్! | Special judicial second class court shock to Alcohol intoxication | Sakshi
Sakshi News home page

తాగుబోతులకు షాక్!

Jun 22 2016 2:53 AM | Updated on Aug 17 2018 7:48 PM

తాగుబోతులకు షాక్! - Sakshi

తాగుబోతులకు షాక్!

తప్పతాగి వాహనాలు నడుపుతున్న వారికి అనంతపురం స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ కోర్టు షాక్ ఇచ్చింది.

అనంతపురం : తప్పతాగి వాహనాలు నడుపుతున్న వారికి అనంతపురం స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరుగురికి రెండ్రోజుల  పాటు  రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ కృష్ణమూర్తి తీర్పునిచ్చారు. ట్రాఫిక్ ఎస్‌ఐ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అనంతపురంలోని పలు కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం మత్తులో బైక్‌లు నడుపుతూ పట్టుబడిన డి.కుళ్లాయిరెడ్డి, బి.నాగరాజు, సి.రాము, ఎం.మధు. కె . విజయకుమార్, బండి నాగేంద్రను కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. వారందరికీ రెండ్రోజుల పాటు రిమాండ్ సహా ఒక్కొక్కరికి రూ.300 చొప్పున జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement