కృష్ణా పుష్కరాలకు డబుల్‌ డెక్కర్‌ రైలు | special double dekker trians for pushkaralu | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు డబుల్‌ డెక్కర్‌ రైలు

Aug 11 2016 12:08 AM | Updated on Sep 4 2017 8:43 AM

తాటిచెట్లపాలెం: విశాఖ వాసుల చిరకాల స్వప్నమైన డబుల్‌ డెక్కర్‌ ఆశలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో విశాఖ–తిరుపతి, విశాఖ–విజయవాడ ప్రాంతాలకు డబుల్‌ డెక్కర్‌రైలు నడపనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

 కృష్ణా పుష్కరాలకు డబుల్‌ డెక్కర్‌ రైలు
డబుల్‌ డెక్కర్‌ రైలు, కృష్ణా పుష్కరాలు, స్పెషల్, విశాఖ
double decker trains, special trains, krishna pushkaralu, visakha
 
తాటిచెట్లపాలెం: విశాఖ వాసుల చిరకాల స్వప్నమైన డబుల్‌ డెక్కర్‌ ఆశలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. కృష్ణాపుష్కరాల నేపథ్యంలో విశాఖ–తిరుపతి, విశాఖ–విజయవాడ ప్రాంతాలకు డబుల్‌ డెక్కర్‌రైలు నడపనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైలు సికింద్రాబాద్‌లో 12న బయలుదేరి 13న విశాఖ చేరుకోనుంది. 
  • ఈనెల 12న 07759 నంబరుతో సికింద్రాబాద్‌లో రాత్రి 09.20 గంటలకు బయలుదేరి, ఆ మర్నాడు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఆ తరువాత విశాఖ నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ ప్రాంతా ల మీదుగా ఈ రైలును నడపనున్నారు. 
  • 07761 నంబరుతో విశాఖ నుంచి తిరుపతికి ఈనెల 13,17,21 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ నుంచి దీన్ని నడిపేయోచనలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో 07762 నంబరుతో తిరుపతి నుంచి 14,18 తేదీల్లో సాయంత్రం బయలుదేరి ఆ మర్నాడు ఉదయం విశాఖ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • విశాఖ–విజయవాడ–విశాఖ రైలును 07763/07764 నంబర్లతో నడపనున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖ నుంచి 07764 నంబరుతో ఈనెల 15,19 తేదీల్లో మధ్యాహ్న సమయంలో బయలుదేరే విధంగా రైల్వే ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • తిరుగు ప్రయాణంలో 07763 నంబరుతో విజయవాడ నుంచి ఈనెల 16,20 తేదీల్లో ఉదయం 10 గంటల సమయంలో బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు ఆగాల్సిన స్టేషన్లు, సమయం వ్యవధి, టికెట్‌ ఛార్జీలు తదితర విషయాలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement