ఆప్కో చేనేత వస్త్రాలపై ప్రత్యేక డిస్కౌంట్
విజయ దశమి, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం, ఎంపిక చేసిన చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆప్కో బోర్డు డైరెక్టర్ పి. నాగలక్ష్మయ్య తెలిపారు.
కర్నూలు(అర్బన్): విజయ దశమి, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం, ఎంపిక చేసిన చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆప్కో బోర్డు డైరెక్టర్ పి. నాగలక్ష్మయ్య తెలిపారు. స్థానిక కొత్త బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్ వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగలక్ష్మయ్య మాట్లాడుతూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా గ్రామీణ చేనేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి సహాయ సంచాలకులు పి. సత్యనారాయణ రావు, ఆప్కో అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ పి. భారతీ, రిటైర్డు మార్కెటింగ్ ఆఫీసర్ బి. పంపయ్య, నరసింహరావు, ఆప్కో ఎగ్జిబిషన్ కర్నూలు ఇన్‌చార్జీ కె.రోజ్ మాణిక్యం, జేటీఓ ఎస్ బాలసుబ్రమణ్యం, డీఈఓలు జీవన్‌కుమార్, పుల్లయ్య పాల్గొన్నారు.