ఎస్కేయూకు సౌర వెలుగులు | solar in sku | Sakshi
Sakshi News home page

ఎస్కేయూకు సౌర వెలుగులు

Aug 15 2016 11:39 PM | Updated on Sep 4 2017 9:24 AM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవి ద్యాలయంలో సౌర విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ అన్నారు.

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవి ద్యాలయంలో సౌర విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ అన్నారు. స్వాత్రంత్య వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఎస్కేయూ స్టేడియంలో జాతీ య జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీలో ఒక మెగా వాట్‌ సౌర విద్యుదుత్పత్తి చేయనున్నామన్నారు. సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ మాలిక్యులార్‌ బయాలజీ పరిశోధన సంస్థ వారు వర్సిటీలో అదనపు పరిశోధన సంస్ధను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు.

23న జెండా పండుగ: ఈ నెల 23న ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులతో జెండా పండుగ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో  రెక్టార్‌ ఆచార్య జి. శ్రీ« దర్,ఆచార్య సీఎన్‌ కృష్ణానాయక్, ఆచార్య బి.పణీశ్వర రాజు , డాక్టర్‌ బి. జెస్సీ  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement