తినుబండారాలను తయారు చేసే షెడ్ అపరిశుభ్రంగా ఉండటంతో శనివారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.
మెదక్: తినుబండారాలను తయారు చేసే షెడ్ అపరిశుభ్రంగా ఉండటంతో శనివారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. పట్టణ పరిధిలోని దాయర వీధిలో తినుబండారాలను ఓ షెడ్‌లో తయారు చేస్తూ పట్టణంలోని పలు బేకరీలకు సరఫరా చేస్తుంటారు. కాగా శనివారం మున్సిపల్ హెల్త్ అధికారి సమక్షంలో పలువురు అధికారులు బేకరీని తనిఖీ చేశారు. శిథిలావ్యస్తకు చెరిన భవనంలో అపరి శుభ్రతతో ఉండటం వల్లా వాటిని తింటే వ్యాధులు వస్తాయని దానిని సీజ్ చేశారు. సీజ్ చేసిన వారిలో అధికారులు విజయశ్రీ, కుర్మయ్య, మొహినొద్దిన్, షాదుల్లా తదితరులు ఉన్నారు.