శివ శివా | siv siva | Sakshi
Sakshi News home page

శివ శివా

Aug 7 2016 11:09 PM | Updated on Sep 4 2017 8:17 AM

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆల యంలో నంది విగ్రహం గతనెల 21 చోరీకి గురికాగా ధ్వంసమై శనివారం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో రోడ్డు పక్కన పొదల్లో కనిపించింది.

జంగారెడ్డిగూడెం రూరల్‌/ జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆల యంలో నంది విగ్రహం గతనెల 21 చోరీకి గురికాగా ధ్వంసమై శనివారం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో రోడ్డు పక్కన పొదల్లో కనిపించింది. విగ్రహాన్ని పెకలించి పట్టుకెళ్లిన దుండగులు అక్కడి పొలాల్లో విగ్రహాన్ని పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే విగ్రహంలో అతి పురాతన వస్తువు ఏదైనా దొరుకుతుందని అనుకున్న దుండగులు ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎ.ఆనందరెడ్డి చేరుకుని ధ్వం సం చేసిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement