చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి | Should be aware acts | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Oct 3 2016 10:06 PM | Updated on Sep 4 2017 4:02 PM

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

మిర్యాలగూడ టౌన్‌ వివిధ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి అజిత్‌సింహరావు, సినియర్‌ సివిల్‌ జడ్జి వై.సత్యేంద్ర, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి అన్నారు.

మిర్యాలగూడ టౌన్‌ 
 వివిధ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి అజిత్‌సింహరావు, సినియర్‌ సివిల్‌ జడ్జి వై.సత్యేంద్ర, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి అన్నారు. సోమవారం స్థానిక కోర్టులో మండల న్యాయసేవా సంస్థ, ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు వారు సంయుక్తంగా కాంట్రాక్టర్‌ చట్టం, ఇండియన్‌ స్టాంపు, రిజిస్ట్రేషన్, వారసత్వం, ఆస్తుల బదలాయింపు, డబ్బు లావాదేవిలకు సంబంధించిన దావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉంటేనే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీజీవిపీ చైర్మన్‌ వి. నర్సింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి, ఏపీపీ నరేందర్‌రెడ్డి, సీహెచ్‌ రఘురామారావు, రీజినల్‌ మేనేజర్‌ రమణామూర్తి, డాక్టర్‌. పందిరి రవీందర్, డి.శ్రీనివాస్‌ తదితరులున్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement