శివాలయాల్లో కార్తీక శోభ | Shivaalayallo kartheeka shobha | Sakshi
Sakshi News home page

శివాలయాల్లో కార్తీక శోభ

Nov 7 2016 11:28 PM | Updated on Sep 4 2017 7:28 PM

శివాలయాల్లో కార్తీక శోభ

శివాలయాల్లో కార్తీక శోభ

కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన కార్తీక దీపాలతో శివాలయాలు వెలుగులతో నిండాయి.

బద్వేలు అర్బన్‌∙:     కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన కార్తీక దీపాలతో శివాలయాలు వెలుగులతో నిండాయి. ఈ సందర్భంగా రూపరాంపేట శివానందాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లక్షబిల్వార్చన, సహస్రదీపాలంకరణలు చేపట్టగా  భక్తులు విరివిగా పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే దత్తసాయిబాబాల ఆలయ ప్రాంగణంలోని శ్రీ పార్వతిసమేత ఓంకారేశ్వరస్వామి ఆలయంలో 365 శివలింగాలకు భస్మార్చన పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో  ఆలయ గౌరవా«ధ్యక్షులు భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కార్యదర్శి నాగిరెడ్డి శంకర్‌రెడ్డిలతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.  అలాగే  లక్ష్మీపాలెం, చెన్నంపల్లె, కట్టమీద శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయాలలో దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement