తమను ఓ అధికారి వేధిస్తున్నారంటూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిపాలన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడుకు ఫిర్యాదు చేశారు.
జీజీహెచ్‌లో లైంగిక వేధింపులు
Sep 27 2016 9:37 PM | Updated on Jul 23 2018 9:15 PM
గుంటూరు మెడికల్: తమను ఓ అధికారి వేధిస్తున్నారంటూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిపాలన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడుకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారి చెప్పినట్లు నడుచుకోకపోతే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. సాయంత్రం రెండు గంటలకు పైగా ఈవిషయంపై కార్యాలయంలో విస్తృతంగా చర్చ జరిగింది. మినిస్టీరియల్ సంఘ నాయకులు మహిళా ఉద్యోగినులతో సంప్రదింపులు జరిపి, వారి సమస్య గురించి చర్చించారు. కాగా, ఈవిషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడును ‘సాక్షి’ వివరణ కోరగా, అధికారిమీద లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, కేవలం నోటిమాట ద్వారా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందకపోతే విచారణ చేసేందుకు వీలుపడదని, ఇవ్వాలని చెప్పామన్నారు.
Advertisement


