స్కూల్‌ బస్సు-బైక్ ఢీ.. ముగ్గురు మృతి | school bus, byke accident, three men died | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు-బైక్ ఢీ.. ముగ్గురు మృతి

Dec 16 2015 6:51 PM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న బైక్, ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

చిట్యాల(నల్లగొండ): వేగంగా వెళ్తున్న బైక్, ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లెంల గ్రామ  శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాలు.. పలివేల గ్రామానికి చెందిన గోసుకొండ బిక్షం(50), గోసుకొండ నర్సింహ(28), వెంకటేషం(40) తాపి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో పలివెల నుంచి చిట్యాల వైపు ద్విచక్రవాహనం పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న త్రివేణి విద్యా మందిర్‌కు చెందిన స్కూల్‌బస్సును ఢీకొట్టారు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement