సత్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తులు | satya deva darshanam | Sakshi
Sakshi News home page

సత్యదేవుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

Apr 15 2017 12:14 AM | Updated on Sep 5 2017 8:46 AM

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి, సెలవు దినం కావడంతో రత్నగిరి సత్యదేవుని ఆలయానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 12 వేలమంది భక్తులు దర్శించుకోగా 1,233 వ్రతాలు జరిగాయి. సుమారు రూ.12 ల

అన్నవరం :
రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి, సెలవు దినం కావడంతో రత్నగిరి సత్యదేవుని ఆలయానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 12 వేలమంది భక్తులు దర్శించుకోగా 1,233 వ్రతాలు జరిగాయి. సుమారు రూ.12 లక్షల ఆదాయం సమకూరింది. భక్తులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కేహెచ్‌కే దొర, నేవీ డైరెక్టర్‌ థాకరేలు స్వామివారిని దర్శించినవారిలో ఉన్నారు. వారికి ఆలయం వద్ద ఏసీ జగన్నాథరావు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను బహూకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement