వెంకన్నసేవలో సర్దార్ డైరెక్టర్ | sardar gabbar singh director bobby visits tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్నసేవలో సర్దార్ డైరెక్టర్

Apr 7 2016 11:38 AM | Updated on Sep 27 2018 8:48 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు బాబి(కే.ఎస్ రవీంద్ర) స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న దర్శకుడు రవీంద్రకు దర్శనం అనంతరం టిటిడి అధికారలు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు రవీంద్రతో పోటోలు దిగటానికి భక్తులు ఉత్సహం చూపారు.



మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శ్రీవారి సుప్రభాతసేవలో పాల్గొన్నారు.  దర్శన అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement