ఘనంగా సంక్రాంతి సంబరాలు | sankranthi celebrations in sirisilla | Sakshi
Sakshi News home page

ఘనంగా సంక్రాంతి సంబరాలు

Jan 17 2017 12:40 AM | Updated on Sep 2 2018 5:06 PM

ఘనంగా సంక్రాంతి సంబరాలు - Sakshi

ఘనంగా సంక్రాంతి సంబరాలు

మండలంలో సంబరాల సంక్రాంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు.

ముస్తాబాద్‌: మండలంలో సంబరాల సంక్రాంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయమే వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి.. గొబ్బెమ్మలను ఉంచారు. నెరె డు పండ్లు పెట్టారు. సకినాలు, గారెల పిండి వం టకాలతో పల్లెపల్లెన ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీశివకేశవుల ఆలయం,  శ్రీహరిహర పుత్ర అయ్యప్ప ఆలయం, శ్రీవీరాంజనేయ స్వా మి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆవునూర్, పోత్గల్, నామాపూర్, గూడెం, కొండాపూర్‌ గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి.

ఘనంగా సంక్రాంతి వేడుకలు
సిరిసిల్ల రూరల్‌: సిరిసిల అర్బన్, తంగళ్లపల్లి మండలాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పిండివంటలు, ముత్యాల ముగ్గులు వేస్తూ మహిళలు, పిల్ల పెద్దలు వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో చకినాలు, గారెలు, పిండి వంటకాలు వండి, తమ వాకిళ్లలలో ముగ్గులు వేశారు. చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడిపారు. తంగళ్లపల్లి మండలంలోని బస్వాపూర్‌లో సర్పంచ్‌ బూరుగుపల్లి మల్లేశం, ముష్టిపల్లి సర్పంచ్‌ గొల్లపల్లి బాలాగౌడ్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.

అధిక సంఖ్యలో మహిళలు పాల్గోని ముగ్గులు వేశారు. సిరిసిల్ల జెడ్పీటీసీ పూర్మాణి మంజుల, ఎంపీపీ దడిగెల కమలభాయి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వొజ్జల అగ్గిరాములు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అంకారపు రవీందర్‌లు మండల ప్రజలకు సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో..
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఇళ్ల ఎదుట రంగవల్లులతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. ప్రతీఇంట్లో పిండివంటలు గుమగుమలాడాయి. కొత్త అల్లుళ్లు అత్తవారింటికి రాగా వారిని సంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. రెండు మండలాల ప్రజలకు ఎంపీపీ ఎలుసాని సుజాత, జెడ్పీటీసీ తోట ఆగయ్య, సీఐ రవీందర్, ఎస్సై ఉపేందర్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement