వుడయార్‌ శిల్పశాలలో శాలివాహన చక్రవర్తి | salivahana | Sakshi
Sakshi News home page

వుడయార్‌ శిల్పశాలలో శాలివాహన చక్రవర్తి

Mar 14 2017 10:36 PM | Updated on Sep 5 2017 6:04 AM

వుడయార్‌ శిల్పశాలలో శాలివాహన చక్రవర్తి

వుడయార్‌ శిల్పశాలలో శాలివాహన చక్రవర్తి

చరిత్రకందిన తొట్ట తొలి తెలుగు చక్రవర్తి, నవశక సృష్టికర్త, ప్రథమాంధ్ర మహా పాలకుడు శాలివాహన చక్రవర్తి కాంస్య విగ్రహం కొత్తపేటలోని శిల్పి రాజకుమార్‌ వుడయార్‌ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. ఈ విగ్రహాన్ని శాలివాహన చక్రవర్తి జయంతి రోజైన ఈనెల 22న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నెలకొల్పనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో గుంటూరు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం వారు ఈ విగ్రహాన్ని

కొత్తపేట :
చరిత్రకందిన తొట్ట తొలి తెలుగు చక్రవర్తి, నవశక సృష్టికర్త, ప్రథమాంధ్ర మహా పాలకుడు శాలివాహన చక్రవర్తి కాంస్య విగ్రహం కొత్తపేటలోని శిల్పి రాజకుమార్‌ వుడయార్‌ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. ఈ విగ్రహాన్ని శాలివాహన చక్రవర్తి జయంతి రోజైన ఈనెల 22న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నెలకొల్పనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో గుంటూరు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం వారు ఈ విగ్రహాన్ని తయారుచేయించారు. మంగళవారం ఈవిగ్రహాన్ని చిలకలూరిపేటకు తరలించారు. అశోకుడు కాలంలో మగధ సామ్రాజ్యానికి శాలివాహన చక్రవర్తి సామంతుడుగా ఉంటూ  ప్రత్యేక ప్రతిపత్తితో పాలన సాగించారు. తరువాత  గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని ధరణికోటను రాజధానిగా చేసుకుని సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఆ చక్రవర్తి కథతోనే ఇటీవల బాలకృష్ణ హీరోగా ‘గౌతవీుపుత్ర శాతకర్ణి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ చక్రవర్తి విగ్రహం తొలుత ఎ¯ŒSటీ రామారావు హయాంలో హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నెలక్పొనున్న ఈ విగ్రహం నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిదని శిల్పి రాజ్‌కుమార్‌ తెలిపారు.
గుర్రం రెండు కాళ్లపై రెండు టన్నుల విగ్రహం
ముందు రెండు కాళ్లు పైకి లేపి వెనుక రెండు కాళ్లపై నిలబడిన గుర్రంపై ఒక చేత్తో ఖడ్గం, మరో చేత్తో కళ్లెం పట్టుకున్న శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని 12 అడుగుల పొడవున సుమారు రెండు టన్నుల కాంస్యంతో తయారుచేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement